న్యూఢిల్లీ: భారీ నష్టాలకు తోడు ఇటీవలి ఏజీఆర్ వివాదంతో ఇబ్బందులు పడుతున్న ప్రముఖ టెలికాం సంస్థ భారతి ఎయిర్‌టెల్‌కు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఎక్స్‌పోర్ట్ ఆబ్లిగేషన్స్‌కు అనుగుణంగా ప్రవర్తించలేదన్న ఆరోపణలతో డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ భారతి ఎయిర్‌టెల్‌ను బ్లాక్ లిస్ట్ లో పెట్టింది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎగుమతుల ప్రోత్సాహక పథకాల (ఇపీసీజీ) పథకం కింద ఎగుమతి నిబంధలను నెరవేర్చకపోవడంతో భారతి ఎయిర్‌టెల్‌ను విదేశీ వాణిజ్య రెగ్యులేటరీ ఈ జాబితాలో చేరింది.
ఎయిర్‌టెల్‌కు భారీ షాక్