కరోనా: మేనల్లుడితో సరదాగా స్టార్‌హీరో

కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో గత కొంతకాలంగా బాలీవుడ్‌ సెలబ్రిటీలంతా ఇంటికే పరిమితమమైన సంగతి తెలిసిందే. ఇక ఏప్పుడు బిజీబిజీగా ఉండే స్టార్‌ హీరోలు సైతం ఇంట్లో ఉండటంతో ఈ విలువైన విరామ సమయాన్ని తమ కుటంబ సభ్యులతో సరదాగా గడుపుతున్నారు. సెల్ఫ్‌ క్వారంటైన్‌లో ఉన్న బాలీవుడ్‌ భామ కత్రినా కైఫ్‌ కూడా ఇంట్లో తను సరదగా గడుపుతున్న వీడియోలను, ఫొటోలను నిరంతరం సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్నారు. గతంలో తను వ్యాయమం చేస్తున్న వీడియోను షేర్‌ చేయగా.. తాజాగా గిన్నెలు కడుగుతూ ఇంటి పనుల్లో బిజీగా ఉన్న వీడియోను అభిమానులతో పంచుకున్నారు. (జనతా కర్ఫ్యూ: ఆత‍్మతో అక్కడ ఉన్నాను)